No Headline
కరీంనగర్‌క్రైం: గుజరాత్‌కు చెందిన సైబర్ నేరగాళ్లు కరీంనగర్ వాసులపై కన్నేస్తున్నారు. ఆన్‌లైన్ వ్యాపారాలు, ఆకర్షిణీయమైన లాభాలు, పెట్టుబడి డబుల్ అవుతుందంటూ నమ్మిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో అమాయకుల ఆధార్‌కార్డులు, చిరునామాలతో బ్యాంకు అకౌంట్లు, మొబైల్ నంబర్లు తీసుకొని వాటితో ఆపరేట్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు సైబర్ పోలీసుల దర్యాప్తులో తేలింది. సైబర్ కేసుల పరిష్కారంలో కరీంనగర్ సైబర్ పోలీస్‌స్టేషన్ రాష్ట్ర వ్యాప్తంగా మూడో స్థానంలో నిలిచి రాష్ట్ర సైబర్ సెక్యురిటీ బ్యూరోతో అభినందనలు అందుకుని ఆదర్శంగా నిలిచింది.
పటిష్టమవుతున్న సైబర్ క్రైం విభాగం
కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన సైబర్ క్రైం పోలీసుస్టేషన్ సైబర్ క్రైం కేసులు ఛేదించుట, బాధితుల సొత్తును తిరిగి ఇప్పించుటలో రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచింది. సైబర్ నేరాల నియంత్రణ, అడ్డుకట్ట వేసేందుకు పోలీస్‌స్టేషన్ల వారీగా సైబర్ వారియర్‌లను నియమించారు. సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో సైబర్ నేరం జరిగిందని తెలిసిన వెంటనే స్పందిస్తున్నారు. పోగొట్టుకున్న సొత్తును తిరిగి తెప్పించేలా చర్యలు తీసుకుంటున్నారు.
అనధికారిక యాప్‌లలో పెట్టుబడి పెట్టొద్దు
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అనధికారిక యాప్‌లు, ప్లాట్‌పారంలలో పెట్టుబడి పె ట్టొద్దు. సైబర్ నేరాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం.
– నర్సింహారెడ్డి, సైబర్ క్రైం ఎస్‌హెచ్‌వో
Comments
Please login to add a commentAdd a comment