‘కళాసిల్క్’ ప్రదర్శనకు స్పందన
కరీంనగర్‌కల్చరల్: కరీంనగర్‌లోని శ్రీ రాజేరాజేశ్వర కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కళాసిల్క్ చేనేత హస్తకళ ప్రదర్శనకు ఆదరణ లభిస్తోంది. ఈ మేళాలో పట్టు, ఫ్యాన్సీ డిజైన్, పోచంపల్లి చీరలు, డ్రెస్ మెటీరియల్స్, చుడీదార్స్, సూటింగ్స్ షర్టింగ్స్, జువెల్లరీ, బెడ్ షీట్స్ అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు శుక్రవారం తెలిపారు. అలాగే, ధర్మవరం, వెంకటగిరి, మంగళగిరి, కలంకారి, ఉ ప్పాడల్లో ప్రఖ్యాతి పొందిన చీరలు ఇక్కడ ఉన్నాయని పేర్కొన్నారు. హరియానా బెడ్ కవర్లు, కుషన్ కవర్లు, లక్నో కుర్తీస్, డ్రెస్ మెటీరియల్స్, డోర్ క ర్టన్స్, స్టోన్ జువెల్లరీ, పెరల్స్, క్రాఫ్ట్స్, బంజారా, కోల్‌కతా బ్యాగులు, ఒడిశా పెయింటింగ్స్, మధ్యప్రదేశ్ చందేరి, మహేశ్వరి, రాజస్ఠాన్ కోటా బాందేజన్, బ్లాక్‌ప్రింట్స్, సంగ్నరి ప్రింట్స్, డ్రెస్ మెటీరి యల్స్, ఉత్తరప్రదేశ్ జామ్దాని, బనారస్ లక్నొవి మె టీరియల్స్ విక్రయిస్తున్నట్లు తెలిపారు. పలు రకాల వస్తువులు సరసమైన ధరలకు లభిస్తాయన్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
అక్టోబర్ 24 నుంచి నవంబర్ 18 వరకు ప్రతీరోజు ఉదయం 10 నుంచి రాత్రి 9 గంటల వరకు మేళా అందుబాటులో ఉంటుంది. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. చేనేత, హస్తకళ సామగ్రి అందుబాటు ధరల్లో ఉన్నాయి.
– బిజుముండల్, ఎగ్జిబిషన్ మేనేజర్
Comments
Please login to add a commentAdd a comment