పవర్ ఇంజినీర్స్ ఉమ్మడి జిల్లా కార్యవర్గం ఎన్నిక
కొత్తపల్లి(కరీంనగర్): తెలంగాణ పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా కార్యవర్గం శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నికై ంది. సెక్రటరీగా నాయిని అంజయ్య, ట్రెజరర్‌గా జి.రఘు, రాష్ట్ర ట్రాన్స్‌కో వైస్ ప్రెసిడెంట్‌గా ఎం.రమేశ్, కంపెనీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా కె.రాజు, కరీంనగర్ జిల్లా కార్యదర్శిగా స్వామి, పెద్దపల్లి జిల్లా కార్యదర్శిగా ప్రభాకర్, జగిత్యాల జిల్లా కార్యదర్శిగా ప్రసాద్, జాయింట్ సెక్రటరీగా శశికాంత్, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీలుగా షరీఫ్, ప్రదీప్, అనిల్, ఆడిట్ కమిటీ సభ్యుడిగా గట్టయ్య, అదనపు కార్యదర్శులుగా సంతోష్, రమాకాంత్, పూర్ణచందర్ ఎన్నికయ్యారు. ఏఈ స్థాయి నుంచి చీఫ్ ఇంజినీర్ స్థాయి వరకు ఇంజినీర్లు పాల్గొన్నారు.
బాయ్‌సాబ్ ఇక లేరు
● గుండెపోటుతో మాజీ డీసీసీ అధ్యక్షుడు కలకుంట్ల హన్మంతరావు మృతి
శంకరపట్నం: బాయ్‌సాబ్ ఇకలేరు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా డీసీసీ మాజీ అధ్యక్షుడు కలకుంట్ల హన్మంతరావు శుక్రవారం వేకువజామున హైదరాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో గుండెపోటుతో మరణించాడు. శంకరపట్నం మండలం ఏరడపల్లి గ్రామానికి చెందిన కలకుంట్ల హన్మంతరావు ఉమ్మడి కరీంనగర్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఐదేళ్లపాటు పనిచేశారు. 1994 కాలంలో ఐదేళ్లపాటు డీసీసీ అధ్యక్షుడిగా కొనసాగారు. హన్మంతరావును కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఆప్యాయంగా బాయ్‌సాబ్ అని పిలిచివారు. 1982లో రాజీవ్‌గాంధీ శంకరపట్నం మండలం తాడికల్‌కు వచ్చినప్పుడు హన్మంతరావు కలిశారు. తాడికల్ సహకార సంఘం చైర్మన్‌గా, రైల్వేబోర్డు మెంబర్‌గా సేవలు అందించారు. కొంతకాలంగా కరీంనగర్‌లో నివాసం ఉంటన్నారు. హన్మంతరావుకు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. శుక్రవారం కరీంనగర్‌లో అంత్యక్రియలు నిర్వహించగా ఎమ్మెలీ జీవన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్ హాజరయ్యారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఫోన్‌లో ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు.
మాజీ సర్పంచ్ భర్తపై అట్రాసిటీ కేసు
మెట్‌పల్లిరూరల్(కోరుట్ల): ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తి బీఆర్‌ఎస్ నాయకుడు, మాజీ సర్పంచ్ భర్త సున్నం సత్యంపై అట్రాసిటీ కేసు నమోదైనట్లు ఎస్సై అనిల్ తెలిపారు. ఈనెల 10న గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళ ఇంటిపైకి సత్యం దాడికి వెళ్లాడని, అడ్డు వచ్చిన కుమారుడిపై దురుసుగా ప్రవర్తించి దుర్భాషలాడినట్లు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. కాగా గురువారం మెట్‌పల్లి డీఎస్పీ రాములు గ్రామంలో విచారణ జరిపారు. అనంతరం సత్యంను రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై వివరించారు.
ఒకరిపై కేసు
సుల్తానాబాద్‌రూరల్: సుల్తానాబాద్ మండలం మంచిరామి గ్రామానికి చెందిన మహిళతో అదే గ్రామానికి చెందిన మధునయ్య అసభ్యకరంగా ప్రవర్తించగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రావణ్‌కుమార్ తెలిపారు. సదరు మహిళ గురువారం వేకువజామున ఇంటిఎదుట వాకిలి ఊడుస్తోంది. మధునయ్య వచ్చి మహిళ చేయి పట్టుకుని, అసభ్యకరంగా ప్రవర్తించాడు. చంపుతానని బెదిరించాడు. మహిళ గట్టిగా అరవడంతో పక్కనే ఉన్నవాళ్లు రావడంతో మధునయ్య అక్కడి నుండి వెళ్లిపోయాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
రేషన్ బియ్యం పట్టివేత
జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం కల్లెడ గ్రామంలోని శ్రీ ఆంజనేయ రైస్‌మిల్లులో అక్రమంగా నిల్వ ఉన్న 10 క్వింటాళ్ల రేషన్ బియ్యం, 160 క్వింటాళ్ల నూకలను శుక్రవారం సాయంత్రం ఎస్బీ ఏఎస్సై మధు పట్టుకున్నారు. వాటిని డీటీసీఎస్ వరప్రసాద్, రాజేంద్రప్రసాద్‌కు అప్పగించగా, సివిల్‌సప్లై గోదాముకు తరలించారు. బియ్యం, నూకలను నిల్వ ఉంచిన ప్రభాకర్‌పై 6ఏ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment