రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి
తిమ్మాపూర్(మానకొండూర్): ఆరునెలల క్రితం కరీంనగర్ కా ర్పొరేషన్ 8వ డివిజన్ పరిధి లోని అల్గునూర్లో జరిగిన రో డ్డు ప్రమాదంలో తీవ్రంగా గా యపడిన వ్యక్తి మృత్యువుతో పోరాడి చివరకు ఓడిపోయా డు. అల్గునూర్కు చెందిన చిల్ల లక్ష్మయ్య(63), అత డి భార్య ఆరు నెలల క్రితం ద్విచక్ర వాహనంపై పొ లం వద్దకు వెళ్లారు. తిరిగి వస్తుండగా హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపు రాజీవ్ రహదారి మీదుగా వస్తున్న బైరినేని అజయ్రావు కారుతో ఢీకొట్టాడు. ఈ ఘటనలో దంపతులిద్దరికీ గాయాలయ్యాయి. ఇద్దరినీ స్థానికులు కరీంనగర్ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ లక్ష్మయ్య భార్య కోలుకుంది. అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని కార్పొరేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. తలకు ఆపరేషన్లు చేశారు. అయినా పరిస్థితి మెరుగుపడలేదు. శుక్రవారం పరిస్థితి విషమించి మృతిచెందాడు. లక్ష్మయ్యకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
ఆరు నెలలపాటు చికిత్స
చివరకు మృత్యువే గెలిచింది
Comments
Please login to add a commentAdd a comment