ఒకటిన మాలల సింహగర్జన
విద్యానగర్(కరీంనగర్): హైదరాబాద్ పరేడ్‌గ్రౌండ్‌లో డిసెంబర్ 1న మాలల సింహగర్జన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు మాలల ఐక్యత అభివృద్ధి కమిటీ సలహాదారు కొరివి వేణుగోపాల్, కన్వీనర్ జనార్దన్, కో కన్వీనర్లు మల్లేశం, శ్రీనివాస్, ప్రసాద్, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట కమిటీ రాష్ట్ర చైర్మన్ కనకరాజు తెలిపారు. ఆదివారం కరీంనగర్ ప్రెస్‌భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సింహగర్జన కరపత్రాలు ఆవిష్కరించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మొదలు పెట్టిన ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని అన్నారు. నాయకులు మేడి రాజవీరు, నక్క రాజయ్య, కుక్కల లక్ష్మీరాజం, మొగురం రమేశ్, శంకర్, రాజమల్లయ్య, చంద్రమౌళి, కన్వీనర్ దశరథం, వెంకటేశ్, రోడ్డ శ్రీనివాస్, రాజేందర్, వెంకటస్వామి, దాసరి లింగయ్య, రవీందర్, రేణుక, రజిని, పుష్పలత, లలిత, మహేందర్, రఘుపతి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment