సీఎం పర్యటనను అడ్డుకుంటాం
కరీంనగర్టౌన్: విద్యారంగ సమస్యలు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈనెల 25న కరీంనగర్లో జరుగనున్న సీఎం పర్యటనను విద్యార్థులతో కలిసి అడ్డుకుంటామని బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్ అన్నారు. ఆదివారం నగరంలోని బీసీ సంక్షేమ కార్యాలయంలో బీసీ యువజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు సంజీవ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. పెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజురీయింబర్స్ మెంట్ విడుదల చేయాలని తెలిపారు. రాష్ట్రంలో విద్యార్థులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నప్పటికీ సీఎం రేవంత్రెడ్డి కనీసం స్పందించడం లేదన్నారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలపై స్పందించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో బీసీ సంక్షేమ సంఘం, అనుబంధ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పోకల విజయ్, కొట్టె శివ, బీసీ సంక్షేమ, అనుబంధ సంఘం నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment