విజిబుల్ పోలీసింగ్ పెంచాలి
కరీంనగర్ క్రైం: కమిషనరేట్ వ్యాప్తంగా విజిబుల్ పోలీసింగ్ పెంచాలని, తద్వారా ప్రజలతో సంబ ంధాలు మెరుగుపడి, క్షేత్రస్థాయిలో శాంతిభద్రతల సమస్యలు తెలుస్తాయని సీపీ అభిషేక్ మహ ంతి అన్నారు. మంగళవారం కమిషనరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని అన్ని విభాగాల పోలీ సు అధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. నైట్ పెట్రోలింగ్ మరింత పటిష్టంగా నిర్వహించాలన్నారు. డయల్ 100 ద్వారా వచ్చే ప్రతీ ఫిర్యాదుపై క్షేత్రస్థాయి వెళ్లి, పరిశీలించాలని సూచించారు. రౌడీషీటర్లు, హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచి, వారి కదలికలను గమనించాలని పేర్కొన్నారు. గంజాయి రవాణాను అరికట్టేందుకు కమిషనరేట్ స్థాయిలో నార్కోటిక్ కంట్రోల్ సెల్ ఏర్పాటు చేశామని తెలిపారు. సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీస్‌స్టేషన్ల వారీగా సైబర్ వారియర్‌లను నియమించామన్నారు. డివిజన్ల వారీగా రోడ్డు ప్రమాదాలు, పెండింగ్ కేసుల వివరాలు తెలుసుకున్నారు. ప్రొబెషనరీ ఐపీఎస్ యాదవ్ వసుంధర ఫౌరెబి, అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ, ఏసీపీలు శ్రీనివాస్, నరేందర్, వెంకటరమణ, శ్రీనివాస్, విజయ్‌కుమార్, వేణుగోపాల్, కాశయ్య, మాధవిలు, సీఐలు, ఎస్‌హెచ్‌వోలు పాల్గొన్నారు.
సీపీ అభిషేక్ మహంతి
కమిషనరేట్‌లో నేర సమీక్షా సమావేశం
Comments
Please login to add a commentAdd a comment