కార్మికుల సొంతింటి కల సాకారం చేస్తాం
గోదావరిఖని: సింగరేణి కార్మికుల సొంతింటి కల సాకారం చేయడమే లక్ష్యంగా సీఐటీయూ ముందుకు సాగుతోందని ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి అన్నారు. జీడీకే–5 ఓసీపీపై మంగళవారం జరిగిన గేట్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. పైసా ఖర్చు లేకుండా సింగరేణి కార్మికులకు సొంతిళ్లు నిర్మించే వీలుందని తెలిపారు. కార్మికులకు సొంతింటి పథకం అమలు చేస్తే సింగరేణి సంస్థకు మున్సిపాలిటీలకు బిల్లుల చెల్లింపు, నిర్వహణ ఖర్చులు మిగులుతాయని వివరించారు. కార్మికులకు సొంతిళ్లు ఉంటే.. అధికారులు కేవలం యాజమాన్యం నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తిపైనే దృష్టి సారించే అవకాశం ఉంటుందని అన్నారు. సింగరేణి క్వార్టర్ పొందిన కార్మికుడికి పెర్క్స్‌పై ఇన్‌కంట్యాక్స్ చెల్లించే వీలు కూడా ఉండదని, ఆ సొమ్ము మిగులుతుందన్నారు. యాజమా న్యం వడ్డీలేని రుణం రూ.30 లక్షలు చెల్లిస్తే నయాపైసా ఖర్చు లేకుండా ఇంటి నిర్మాణం పూర్తిచేయొ చ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలా చేస్తే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్మికులకు ఇచ్చిన హామీ కూడా నెరవేరుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు మేదరి సారయ్య, తోట నరహరి రావు, ఆరెపల్లి రాజమౌళి, మెండె శ్రీనివాస్, విజయ్‌కుమార్, ఎస్‌కే గౌస్, ఈద వెంకటేశ్వర్లు, ఎస్.శ్రీనివాస్, బి.ప్రవీణ్, ఆడిచర్ల మల్లేశం, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
● సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment