మాతాశిశు మరణాలు తగ్గించాలి
కరీంనగర్‌టౌన్: మాతాశిశు మరణాలు తగ్గించడానికి సమర్థమైన పద్ధతులు అవలంబించాలని డీఎంహెచ్‌వో వెంకటరమణ అన్నారు. మంగళవారం తన కార్యాలయంలో జిల్లాలోని మొదటి, రెండో ఏఎన్‌ఎంలకు ఒకరోజు శిక్షణ తరగతులు నిర్వహించారు. హైదరాబాద్‌కు చెందిన ఆర్మాన్ ఎన్జీవో గ్రూప్ సహకారంతో సమీకృత అధిక ప్రమాద గర్భధారణ నిర్వహణ నియమాలు మరియు శిక్షణ అనే అంశంపై డీఎంహెచ్‌వో మాట్లాడారు. మహిళలు గర్భిణిగా ఉన్న సమయంలో ఎపిలెప్సీ, మధుమేహం, క్షయవ్యాధి, కామెర్లు, అధిక రక్తపోటు వంటివి ముందుగానే గుర్తించి, వారు క్లిష్టమైన దశలోకి చేరకముందే వైద్యం అందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ సనజవేరియా, రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
యూపీహెచ్‌సీల ఆకస్మిక తనిఖీ
బీఆర్‌ఆర్ కాలనీ, మోతాజ్ ఖానా, కట్టరాంపూర్ పట్టణ ఆరోగ్య కేంద్రాలను డీఎంహెచ్‌వో వెంకటరమణ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యసేవలపై ఆరా తీశారు. ఓసీడీ సేవలందించాలని, సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని, పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment