డీఈవోపై ఆర్‌జేడీ విచారణ
కరీంనగర్: జిల్లా విద్యాధికారి తీరుపై డీటీఎఫ్, టీపీటీఎఫ్ నాయకులు ఇచ్చిన ఫిర్యాదుపై ఆర్‌జేడీ కె.సత్యనారాయణ రెడ్డి మంగళవారం విచారణ చేపట్టారు. డీఈవో జనార్దన్‌రావు ఉపాధ్యాయులను అన్యాయంగా సస్పెండ్ చేశారంటూ సంబంధిత సాక్ష్యాలను నాయకులు అందజేశారు. అలాగే, డీఈవో పుట్టిన తేదీపై, బీఈడీ అర్హతలపై గతంలో వచ్చిన అభియోగాలు, అనవసరపు ఫార్మాట్లు రూపొందించి, ప్రధానోపాధ్యాయులు, టీచర్లపై పనిభారం మోపుతున్న విషయాన్ని ఆర్‌జేడీ దృష్టికి తీసుకొచ్చారు. గత పదోన్నతుల్లో స్కూల్ అసిస్టెంట్ విభాగంలో వివిధ సబ్జెక్టుల్లో, 317 జీవో అమలులో జరిగిన అవకతవకలను, కొంతమంది ప్రధానోపాధ్యాయులను తరచూ ఆన్ డ్యూటీ పేరిట డీఈవో కార్యాలయానికి రప్పిస్తుండటాన్ని, ఆఫీస్‌లో లెక్కకు మించి నాన్ టీచింగ్ స్టాఫ్‌ను వివిధ పాఠశాలల నుంచి డిప్యుటేషన్‌పై నియమించడం, ఇష్టారీతిన ఒక పాఠశాల నుంచి మరొక పాఠశాలకు నాన్ టీచింగ్ స్టాఫ్‌ను డిప్యుటేషన్‌పై పంపడం, డీఈవో ఏరోజూ కార్యాలయంలో అందుబాటులో ఉండకపోవడం, ఫైళ్ల క్లియరెన్స్‌లో తీవ్ర జాప్యం తదితర అంశాలపై ఆర్‌జేడీ విచారణ చేపట్టారు. నివేదికను వీలైనంత తొందరగా ఉన్నతాధికారులకు అందజేయాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరారు. వి.రాజిరెడ్డి, ఆవాల నరహరి, తూముల తిరుపతి, పి.దామోదర్ రెడ్డి, జె.రామచంద్రారెడ్డి, వి.బాలయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment