కొనసాగుతున్న సీఎం కప్ పోటీలు
కరీంనగర్‌స్పోర్ట్స్: సీఎం కప్–2024 జిల్లాస్థాయి క్రీడా పోటీలు రెండోరోజు మంగళవారం కొనసాగాయి. ఈ పోటీలను జిల్లా యువజన, క్రీడాశాఖ అధికారి బి.శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలో ఫుట్‌బాల్ పోటీలును నిర్వహించారు. హుజూరాబాద్ జట్టు ప్రథమ, కరీంనగర్ జట్టు ద్వితీయ స్థానంలో నిలిచాయి. అలాగే, ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ పోటీలు జరుపగా 60 మంది క్రీడాకారులు హాజరయ్యారు. బాక్సింగ్ పోటీల్లో 50 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. స్టేడియం స్విమ్మింగ్ పూల్‌లో నిర్వహించిన స్విమ్మి ంగ్ పోటీలకు 40 మంది బాలబాలికలు హాజరయ్యారు. అకాడమిక్ హైట్స్ పాఠశాల మైదానంలో జిల్లాస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలు నిర్వహించారు. బాలుర విభాగంలో రామడుగు జట్టు ప్రథమ, టీఎస్‌ఎంఎస్ జట్టు ద్వితీయ స్థానం, బాలికల విభాగంలో కోరా పాఠశాల జట్టు ప్రథమ, తిమ్మాపూర్ జట్టు ద్వితీయ స్థానం సాధించాయి. అలాగే, మొదటి రోజు పూర్తిగా నిర్వహించని కబడ్డీ పురుషుల, ఖోఖో పురుషుల పోటీలను రెండోరోజు నిర్వహించారు. కబడ్డీ పురుషుల విభాగంలో కరీంనగర్ అర్బన్ జట్టు ప్రథమ, చిగురుమామిడి జట్టు ద్వితీ య స్థానంలో నిలిచాయి. అలాగే, ఖోఖో పురుషుల విభాగంలో మానకొండూర్ మండలం ప్రథమ, తిమ్మాపూర్ జట్టు ద్వితీయ స్థానం సాధించాయి. ప్రతిభ చాటిన క్రీడాకారులను ఈ నెల 27 నుంచి నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి వేణుగోపాల్, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు గిన్నె లక్ష్మణ్, వంగపల్లి సూర్యప్రకాశ్, మల్లేశ్ గౌడ్, కడారి రవి, ఎండీ.వలీపాషా, రవి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment