విలీన పంచాయితీ | - | Sakshi
Sakshi News home page

విలీన పంచాయితీ

Published Sat, Dec 21 2024 12:13 AM | Last Updated on Sat, Dec 21 2024 12:13 AM

విలీన

విలీన పంచాయితీ

కొంగ జపం

శనివారం శ్రీ 21 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2024

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌:

రీంనగర్‌ నగరపాలక సంస్థలో శివారు గ్రామాల విలీన ప్రక్రియ దాదాపుగా పూర్తయినట్లే కనిపిస్తోంది. అసెంబ్లీ వేదికగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య ఈ అంశంపై వాడీవేడి చర్చ దీనికి సంకేతమని తెలుస్తోంది. గ్రేటర్‌ కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటులో భాగంగా కరీంనగర్‌ నగరపాలక సంస్థలో కొత్తపల్లి మున్సిపాలిటీతోపాటు కొత్తపల్లి మండలంలోని మల్కాపూర్‌, లక్ష్మీపూర్‌, చింతకుంట, కరీంనగర్‌ రూరల్‌ మండలంలోని బొమ్మకల్‌, గోపాల్‌పూర్‌, దుర్శేడ్‌ గ్రామాలను విలీనం చేయాలని ప్రభుత్వానికి కలెక్టర్‌ నివేదిక పంపారు. ఈ మేరకు శివారు గ్రామాలను కరీంనగర్‌ కార్పొరేషన్‌లో విలీనం చేస్తున్నట్లు అసెంబ్లీలో మంత్రి శ్రీధర్‌బాబు ప్రకటించారు. గతంలో కలిపిన గ్రామాల్లో పన్నుల భారం మినహా నేటికీ తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ తదితర కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేదని స్థానిక ప్రజలు వాపోతున్నారు. అందుకే, విలీనంపై ప్రజాభిపాయ సేకరణ చేపట్టిన తర్వాతే నిర్ణయం తీసుకుంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో విలీనంపై తమకు ఇంకా అధికారిక ఆదేశాలు రాలేదని డిప్యూటీ కమిషనర్‌ స్వరూపారాణి ‘సాక్షి’కి తెలిపారు.

వ్యవసాయమే ఆధారం..

కరీంనగర్‌ నగరపాలక సంస్థలో గ్రామాల విలీనంతో ప్రజలపై పన్నుల భారం పడనుంది. అంతేకాకుండా, గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులకు దూరమై, ఉపాధి కోల్పోతామని కూలీలు అంటున్నారు. కొత్తపల్లి పట్టణంతోపాటు చింతకుంట, మ ల్కాపూర్‌, లక్ష్మీపూర్‌, బొమ్మకల్‌, దుర్శేడ్‌, గోపాల్‌పూర్‌లు వ్యవసాయాధారిత గ్రామాలు. విలీనమైతే పట్టణీకరణ జరిగి, పంటల సాగుకు దూరమవుతా మని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పలు గ్రామాల ప్రజలు విలీనం వద్దంటూ నిరసనలు తెలిపారు. అయినప్పటికీ, ప్రభుత్వం విలీనం వైపే మొగ్గు చూపుతున్నట్లు స్పష్టమవుతోంది.

గతంలో ప్రజాభిప్రాయం లేకుండానే..

విలీనం విషయంలో గత ప్రభుత్వం వ్యవసాయాధారిత గ్రామాలైన వల్లంపహాడ్‌, ఆరెపల్లి, తీగలగుట్టపల్లి, సదాశివపల్లి, అల్గునూర్‌ గ్రామాలను విలీనం చేసింది. అప్పుడు వచ్చిన అభ్యంతరాలను పట్టించుకోకుండా ముందుకెళ్లింది. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా అలాగే చేస్తున్నట్లు కనిపిస్తోందని ప్రజలు అంటున్నారు. ప్రజాభిపాయ సేకరణ చేపట్టాకే నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నారు.

అభివృద్ధికి ఆమడ దూరం..

న్యూస్‌రీల్‌

గ్రేటర్‌ కరీంనగర్‌కు రంగం సిద్ధం!

కొత్తపల్లి మున్సిపాలిటీ సహా ఆరు గ్రామాల విలీనానికి నివేదిక

గతంలో కలిపిన గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కరువు

పన్నుల భారం, ఉపాధి కోల్పోతామని ప్రజల ఆవేదన

2018, ఏప్రిల్‌ 12న కరీంనగర్‌ నగరపాలక సంస్థలో విలీనం చేసిన గ్రామాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి. ఈ విషయాన్ని స్వయంగా మేయర్‌ సునీల్‌రావు ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. పద్మనగర్‌, రేకుర్తి, సీతారాంపూర్‌, ఆరెపల్లి, తీగలగుట్టపల్లి, వల్లంపహాడ్‌, సదాశివపల్లి, అల్గునూర్‌ గ్రామాల్లో మౌలిక వసతులు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. విలీనాన్ని కొందరు స్వాగతిస్తుండగా, మెజారిటీ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ చేపడితే తమ డిమాండ్లు, సమస్యలు చెప్పుకునేవారమని ఆయా గ్రామాలవారు అంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
విలీన పంచాయితీ1
1/4

విలీన పంచాయితీ

విలీన పంచాయితీ2
2/4

విలీన పంచాయితీ

విలీన పంచాయితీ3
3/4

విలీన పంచాయితీ

విలీన పంచాయితీ4
4/4

విలీన పంచాయితీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement