కరీంనగర్: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అంబేడ్కర్‌ను అవమానించడాన్ని నిరసిస్తూ తెలంగాణ అంబేడ్కర్ యువజన సంఘం, ప్రజా సంఘాల జేఏసీ అధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. తెలంగాణ అంబేడ్కర్ యవజన సంఘం జిల్లా అధ్యక్షుడు సముద్రాల అజయ్ మాట్లాడుతూ అంబేడ్కర్‌ను అవమానించే విధంగా మాట్లాడిన అమిత్‌షాను వెంటనే కేంద్రమంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. నాయకులు గజ్జెల ఆనంద్‌రావు, సుద్దాల లక్ష్మణ్, శంకర్, ప్రభాకర్, సంపత్, స్వరూప, అనిల్, మనోహర్, భారతి, మహేందర్, చంద్రశేఖర్, లక్ష్మణ్, రవీందర్, నర్సయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment