డాక్టర్ ప్రదీప్‌కుమార్‌కు ప్రైడ్ ఆఫ్ ది నేషన్ అవా
కరీంనగర్‌టౌన్: వైద్యరంగంలో ఉత్తమ సేవలు అందిస్తున్న ఆస్పత్రికి ఆసియా టుడే ఇండియా సంస్థ ఏటా అందించే ఫ్రైడ్ ఆఫ్ ది నేషన్ అవార్డును 2024 సంవత్సరానికిగానూ కరీంనగర్‌లోని శ్రీసాయి లైఫ్‌లైన్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌కు లభించింది. ఈ అవార్డుల ప్రదానోత్సవం శనివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్‌రావు సమక్షంలో గవర్నర్ జిష్ణు దేవ్‌వర్మ చేతుల మీదుగా లైఫ్‌లైన్ హాస్పిటల్ చైర్మన్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ ప్రదీప్‌కుమార్ అవార్డు అందుకున్నారు. హాస్పిటల్ ఏవో డాక్టర్ కంచన్ పాల్గొన్నారు.
బోధన వైద్యుల నిరసన
సిరిసిల్లటౌన్: జిల్లా వైద్యశాల ఎదుట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భోదనా వైద్యుల సంఘం నిరసన చేపట్టింది. వారు మాట్లాడుతూ జగిత్యాలలో సీనియర్ వైద్యుడిపై విపరీత ఆరోపణలు మోపుతూ సరెండర్ చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. అడిషనల్ డీఎంఈలు సకాలంలో రాకపోవడంతోనే ఆ పదవి బాధ్యతలు సైతం తీసుకున్నారన్నారు. గతంలో సదరు వైద్యుడే నిజామాబాద్ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా సమర్థంగా పనిచేసిన విషయాన్ని గుర్తు చేశారు. సమర్థులను ప్రోత్సహించాల్సింది పోయి అవమానపరచడం వ్యవస్థకు మంచిదికాదన్నారు. ఈమేరకు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు.
వకీల్‌పల్లి గనికి బహుమతులు
గోదావరిఖని: సింగరేణి సంస్థ రామగుండం డివిజన్–2 పరిధిలోని వకీల్‌పల్లిగనికి బహుమతులు ప్రకటించారు. ఈనెల 23న కొత్తగూడెంలో జరిగే సింగరేణి ఆవిర్భావ వేడుకల్లో సంస్థ సీ ఎండీ బలరాం చేతులమీదుగా బహుమతులు అందుకోనున్నారు. గనిలోని ఎల్‌హెచ్‌డీ విభాగం, కంటిన్యూస్ మైనర్ విభాగాల్లో బహుమతులను గని దక్కించుకుంది. ఈసందర్భంగా ఆర్జీ–2 జీఎం వెంకటయ్య గని అధికారులను అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment