ఠాణా మెట్లెక్కిన కుల పంచాయితీ
● కుల బహిస్కరణ చేయలేదంటున్న పెద్ద మనుషులు
● కేసులు ఎత్తివేయాలని డిమాండ్
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): తనను కులం నుంచి బహిష్కరించారంటూ మండల కేంద్రానికి చెందిన కొర్రి రమేశ్ శుక్రవారం చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా స్పందించిన పోలీసులు ఏడుగురు కులపెద్దలపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో కులసంఘం సభ్యులు దాదాపు వంద మంది శనివారం ఎల్లారెడ్డిపేట ఠాణాకు వచ్చారు. సంఘం పెద్దలపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కుల సంఘం పెద్దలు గడ్డం జితేందర్, బుర్క ధర్మేందర్, లింగాల దాసు, రేసు శంకర్, మంగురపు అశోక్, లింగాల సందీప్, కొప్పరి రమేశ్‌లపై కేసు నమోదు చేశారు. దీంతో కులసంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో స్టేషన్‌కు వచ్చి కేసును ఉపసంహరించుకొని, కులంలో జరిగిన సంఘటనపై విచారించాలని కోరారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో వారు వెనుదిరిగారు.
Comments
Please login to add a commentAdd a comment