కార్మికుల సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలి
గోదావరిఖని: సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం జీడీకే–2ఏ గనిపై ఏర్పాటు చేసిన గేట్‌మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. కార్మికుల సొంతింటి పథకాన్ని అమలు చేయాలని, ఆలవెన్స్‌లపై ఆదాయపు పన్ను రద్దు చేయాలని, పెండింగ్ విజిలెన్స్ కేసులు పరిష్కరించి డిపెండెంట్లకు ఉద్యోగాలివ్వాలని కోరారు. అసెంబ్లీ, సింగరేణి ఎన్నికలు జరిగి ఏడాదైనా ఇప్పటివరకు ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదని విమర్శించారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం యూనియన్ దశలవారీ పోరాటాలకు సిద్ధమైందని అన్నారు. కోల్‌బెల్ట్ ఎమ్మెల్యేలు కార్మికుల సమస్యలపై అసెంబ్లీలో చర్చించి పరిష్కారం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గేట్ మీటింగ్‌లో నాయకులు ఆరెపల్లి రాజమౌళి, మెండె శ్రీనివాస్, తోట నరహరిరావు, బూర్గుల రాములు, పెండం సమ్మయ్య, వంగల శివరాంరెడ్డి, దుర్గాప్రసాద్, సమ్మయ్య, సుభాష్, తుమ్మ లక్ష్మణ్, శివరామకృష్ణ, తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment