ఎస్టీపీపీలో సింగరేణి ఆవిర్భావ వేడుకలు
జైపూర్: మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటు(ఎస్టీపీపీ)లో సోమవారం సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అడ్మి న్ భవన కార్యాలయంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఎస్టీపీపీ ఈడీ రాజశేఖర్‌రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ సింగరే ణి కంపెనీలో పని చేస్తున్నందుకు ఎంతో గర్వపడాలని, సంస్థ ద్వారా కొన్ని వేల కుటుంబాలు జీవిస్తున్నాయని తెలిపారు. జైపూర్‌లో పవర్ ప్లాంటు ఏ ర్పాటు చేసుకుని నిరంతరం రాష్ట్రానికి విద్యుత్ ఉ త్పత్తి చేస్తుందని అన్నారు. సాయంత్రం నిర్వహించి న వేడుకల్లో ఉత్తమ ఉద్యోగులు మల్లెల సత్యనారాయణరెడ్డి(సీనియర్ ఇన్‌స్పెక్టర్), కేవీ.వైష్ణవి(సీనియర్ అసిస్టెంట్), ఉత్తమ అధికారులు కొండ వెంకటయ్య(ఎస్‌ఈ ఈఅండ్‌ఎం), డి.నవీన్‌కుమార్(డీవై ఎస్‌ఈ, ఈఅండ్‌ఎం)లను శాలువాలతో సన్మానించి ప్రశంసాప్రత్రం అందజేశారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక పోటీలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎస్టీపీపీ జీఎం శ్రీనివా సులు, వోఅండ్‌ఎం చీఫ్ జెన్‌సింగ్, ఏఐటీయూసీ ఫిట్ సెక్రెటరీ సత్యనారాయణ, సీఎంవోఏఐ బ్రాంచ్ ప్రెసిడెంట్ సముద్రాల శ్రీనివాస్, పీఎంపీల్ హె డ్ అఖిల్‌కపూర్, పీఈఎస్ కంపెనీ హెడ్ శ్రీనివాస్, సీఐఎస్‌ఎఫ్ కమాండెంట్ యోగేశ్‌కుమార్, డీజీఎం పర్సనల్ అజ్మీరా తుకారం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment