ఇందిరమ్మ ఇళ్లు.. భూ సమస్యలు
కరీంనగర్ అర్బన్: ‘ప్రజావాణి’ జన జాతరను మరిపించింది. ఇందిరమ్మ ఇళ్ల సర్వే జరుగుతుండగా గతవారం ప్రజావాణిని రద్దు చేసిన విషయం విదితమే. సోమవారం నాటి కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి జనం తరలివచ్చారు. 333 మంది తమ సమస్యలను విన్నవించారు. ఇందిరమ్మ ఇళ్లు, భూ సమస్యలే అర్జీలు పెరగడానికి కారణమని స్పష్టమవుతోంది. మండలస్థాయిలో పరిష్కరించే అంశాలే కాగా అక్కడి అధికారుల నిర్లక్ష్యం.. పర్యవేక్షణలోపం వెరసి ప్రజలు జిల్లాకేంద్రానికి తరలివస్తున్నారు. ప్రధానంగా భూ సమస్యలు, పింఛన్లు, డబుల్ బెడ్‌రూం ఇళ్లకు అర్జీలు అందజేశారు. కలెక్టర్ పమేలా సత్పతి, నగరపాలక కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్, అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ ఫిర్యాదులను స్వీకరించారు.
ప్రజావాణికి ఫిర్యాదుల జాతర
ఒక్కొక్కరిది ఒక్కో గాథ
ఇందిరమ్మ ఇల్లు ఇప్పించండి
మావి నిరుపేద కుటుంబాలు. రెక్కాడితేనే డొక్కాడే పరిస్థితి. అద్దె ఇళ్లల్లో జీవనం సాగిస్తున్నం. ప్రభుత్వం ఇందిరమ్మ పథకం కింద ఆర్థిక చేయూతనిస్తుండగా మమ్మల్ని స్కీంలో చేర్చాలి. గతంలో చాలాసార్లు దరఖాస్తులు ఇచ్చాం.. కానీ ఇళ్లు మంజూరు కాలేదు. ఈ సారైనా ఇళ్లు మంజూరు చేయాలి. – మహిళలు, కరీంనగర్
మొత్తం అర్జీలు: 333
కరీంనగర్ కార్పొరేషన్: 59
డీపీవో: 19, ఆర్డీవో కరీంనగర్: 19
కరీంనగర్ రూరల్ తహసీల్దార్: 14
మానకొండూరు తహసీల్దార్: 13
కొత్తపల్లి తహసీల్దార్: 10
వారధి సొసైటీ: 16
ఎంపీడీవో, తిమ్మాపూర్: 10
సీపీ ఆఫీస్: 13, ఇతర అర్జీలు: 160
Comments
Please login to add a commentAdd a comment