జీవితంపై విరక్తితో ఒకరి ఆత్మహత్య
మల్లాపూర్: ఒంటరి జీవితం భరించలేక ఎస్‌ఆర్ రాజేశ్(52) అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై రాజు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. కేరళ రాష్ట్రం అలెప్పి జిల్లా కొట్టనాడు తాలుక తగ్గడి గ్రామానికి చెందిన శారదామందిర్ రాజప్పన్(ఎస్‌ఆర్) రాజేశ్(52) కొన్నేళ్లుగా మల్లాపూర్‌లో నివాసం ఉంటున్నాడు. కొత్తదాంరాజుపల్లిలోని కేరళ హైస్కూల్‌లో టీచర్‌గా చేస్తున్నాడు. రాజేశ్‌కు 12ఏళ్ల క్రితం వివాహం జరిగింది. సంతానం కలుగకపోవడంతో దంపతుల మధ్య తరుచూ గొడవలు జరిగి విడివిడిగా ఉంటున్నారు. భార్య వెళ్లిపోవడంతో కొంతకాలంగా తీవ్రమనస్తాపం చెందుతూ ఒంటరి జీవితం గడుపుతున్నాడు. ఈనెల 14న ఇంటి నుంచి బయటికి వెళ్లి గ్రామశివారులోని దుబ్బగట్టు ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాజేశ్ కనిపించకపోవడంతో స్థానికులు సమీప ప్రాంతంలో గాలించారు. దుబ్బగట్టు ప్రాంతంలో ఉరివేసుకుని వేలాడుతున్న రాజేశ్ మృతదేహం కనిపించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కేరళ హైస్కూల్ ప్రిన్సిపాల్ సీబీ.అనిల్‌సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment