కోర్టుకు హాజరైన ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి
కరీంనగర్‌క్రైం: హుజూరాబాద్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి మంగళవారం కోర్టు మంజూరు చేసిన బెయిళ్లకు సంబంధించి గురువారం కౌశిక్‌రెడ్డి కరీంనగర్ మేజిస్ట్రేట్ కోర్టుకు హాజరై పూచీకత్తులను సమర్పించారు. కరీంనగర్ కలెక్టరేట్‌లో ఈనెల 12న నిర్వహించిన ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజీవ్‌కుమార్‌తో గొడవకు సంబంధించి కౌశిక్‌రెడ్డిపై కరీంనగర్ వన్ టౌన్ పీఎస్‌లో రెండు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ రెండు కేసుల్లో అతన్ని సోమవారం రాత్రి అరెస్టు చూపిన పోలీసులు మంగళవారం ఉదయం మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. షరతులతో కూడిన బెయిల్ మంజూరయింది. కోర్టు ఆదేశాల ప్రకారం కౌశిక్‌రెడ్డి పూచీకత్తులను కోర్టుకు సమర్పించగా.. కోర్టు స్వీకరించింది.
Comments
Please login to add a commentAdd a comment