2 నుంచి వేంకటేశ్వర బ్రహ్మోత్సవాలు
● కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్ కల్చరల్: జిల్లాకేంద్రంలోని మార్కెట్ రోడ్డు వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 2 నుంచి 10 వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. శ్రీలక్ష్మీ, పద్మావతి సమేత వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో దేవాదాయశాఖ ఆధ్వర్యంలో వివిధశాఖల అధికారులతో సమీక్షించారు. భక్తులకు తాగునీరు, షామియానా, క్యూలైన్లు, బారికేడ్లు, అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. ఆలయ పరిసరాల్లో పారిశుధ్యం లోపించకుండా చూడాలని మున్సిపల్‌శాఖ అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూడాలని పోలీస్ అధికారులకు సూచించారు. స్టేజీ, లైటింగ్, సౌండ్, డెకరేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ఫైరింజిన్ అందుబాటులో ఉంచాలన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దన్నారు. వైద్య శిబిరం ఏర్పాటు చేయాలన్నారు. అదనపు కలెక్టర్లు ప్రఫుల్‌దేశాయ్, లక్ష్మీకిరణ్, నగరపాలక కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్, శిక్షణ కలెక్టర్ అజయ్ యాదవ్, ఇన్‌చార్జి డీఆర్‌వో పవన్‌కుమార్, ఆర్డీవో మహేశ్వర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment