పవర్ కట్ ప్రాంతాలు
కొత్తపల్లి: కరీంనగర్‌లో విద్యుత్ మరమ్మతు పనులు చేపడుతున్నందున శుక్రవారం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 11.30 గంటల వరకు 11కేవీ గీతాభవన్, మంకమ్మతోట ఫీడర్ల పరిధిలోని ఆకుల శైలజ ఆసుపత్రి, మంకమ్మతోట, పాత లేబర అడ్డ, హనుమాన్ ఆలయం, దన్గర్‌వాడీ పాఠశాల ప్రాంతాలు, ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 11కేవీ రాంనగర్ ఫీడర్ పరిధిలోని సత్యనారాయణ స్వామి ఆలయం, చేపల మార్కెట్, బొబ్బిలి లక్ష్మయ్య అపార్ట్‌మెంట్, మధ్యాహ్నం 1.30 నుంచి 3.30 వరకు 11 కేవీ శివనగర్, ఇండస్ట్రీయల్ ఫీడర్ పరిధిలోని సప్తగిరికాలనీ, శివనగర్, ప్రగతినగర్, రామాలయం హస్నాపురికాలనీ, టెలి ఫోన్ క్వార్టర్స్, మార్కెండేయనగర్, సాయిబాబా ఆలయం, రాంనగర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్–2 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు. అదేవిధంగా మధ్యాహ్నం 12 నుంచి 1.30 గంటల వరకు 11 కేవీ కమాన్ ఫీడర్ పరిధిలోని కోతిరాంపూర్‌లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్–1 ఏడీఈ పి.శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment