అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి
● నగరపాలక సంస్థ కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలని నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్ అన్నారు. గురువారం నగరంలోని 20వ డివిజన్ ఆరెపల్లిలో కొనసాగుతున్న అభివృద్ధిపనులను, డివిజన్‌లోని పారిశుద్ధ్యం తీరును, మట్టిరోడ్లను ఆమెతనిఖీ చేశారు. అలాగే తెలంగాణచౌక్‌తో పాటు ఇతరరత్రా ప్రాంతాలను కూడా పరిశీలించారు. అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తిచేసేలా ఇంజినీరింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అభివృద్ధి పనులు అవసరమైన చోట అంచనాలు సమర్పించాలన్నారు. అలాగే నగరంలోని అన్ని ప్రాంతాల్లో పారిశుధ్యం మెరుగ్గా ఉండేలా చూడాలని ఆదేశించారు. డ్రైనేజీల్లో సిల్ట్ తొలగించాలని, డ్రైనేజీల వెంట కలుపు మొక్కలు, చెత్తాచెదారం లేకుండా శుభ్రం చేయాలన్నారు. కార్యక్రమంలో 20వ డివిజన్ కార్పొరేటర్ తుల రాజేశ్వరి బాలయ్య, డీఈలు వెంకటేశ్వర్లు, ఓంప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment