బీఆర్‌ఎస్ హయాంలోనే కౌశిక్‌రెడ్డిపై 15 కేసులు
● సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి
కరీంనగర్ కార్పొరేషన్: బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే కౌశిక్‌రెడ్డిపై 15 కేసులు నమోదయ్యాయని సుడా చైర్మన్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక 28 కేసులు పెట్టారంటూ హరీష్‌రావు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్‌లోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో గురువారం విలేకరుల సమావేశంలో కౌశిక్‌రెడ్డిపై ఉన్న కేసుల వివరాలు ఆధారాలతో సహా వెల్లడించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంపై అబద్దాలతో విషప్రచారం చేస్తున్నారని బీఆర్‌ఎస్ నాయకులపై మండిపడ్డారు. 2013 నుంచి 2023 వరకు కౌశిక్‌రెడ్డిపై 15 కేసులు నమోదైనట్లు చెప్పారు. ఇవన్నీ బెదిరింపులు, భూఆక్రమణలు వంటి సంఘటనల్లో స్థానిక పోలీసులు పెట్టిన కేసులు అని వివరించారు. బీఆర్‌ఎస్ హయాంలో పెట్టిన కేసులకు ఎవరూ బాధ్యత వహిస్తారో తెలపాలని కోరారు. నేరచరిత్ర గల వ్యక్తులకు బీఆర్‌ఎస్ రెడ్‌కార్పెట్‌తో ఆహ్వానం పలుకుతోందని విమర్శించారు. తోటి ఎమ్మెల్యేపై దాడిచేసి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి వచ్చిన వ్యక్తికి ఎదురేగి ఆలింగనం చేసుకోవడం కేటీఆర్, హరీష్‌ల దిగజారుడు రాజకీయానికి నిదర్శనమని విమర్శించారు. దొంగలముఠా బీఆర్‌ఎస్‌ను ప్రజలు నిలదీయాలని కోరారు. కోటగిరి భూమాగౌడ్, ఆకుల నర్సయ్య, అర్ష మల్లేశం, గంట శ్రీనివాస్, వాడె వెంకటరెడ్డి, గుండాటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రవణ్‌నాయక్, కొరివి అరుణ్‌కుమార్, ఎండీ తాజ్, తమ్మిడి ఎజ్రా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment