వర్సిటీ అధ్యాపకులకు నియామక పత్రాలు అందజేత
కరీంనగర్‌సిటీ: శాతవాహన విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య ఉట్కూర్ ఉమేశ్‌కుమార్ తన బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి తనదైన శైలిలో విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తున్నారు. నూతనంగా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌గా ఆచార్య రవికుమార్ జాస్తిని(ఉస్మానియా విశ్వవిద్యాలయం) నియామకం చేశారు. 2025–26 సంవత్సరానికి మూడు సంవత్సరాల ఎల్‌ఎల్‌బీ కోర్సు, ఎంఫార్మసీని మంజూరు చేయించారు. పరిపాలన విభాగంలో కూడా తనదైన ముద్ర వేస్తూ అధ్యాపకులకు వివిధ పదవులను అందిస్తూ నియామక పత్రాలు జారీ చేశారు. కామర్స్ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉన్న డాక్టర్ హరికాంత్‌ను వీసీకి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(ఓఎస్డీ)గా నియామకం చేశారు. ఉర్దూ విభాగంలో పని చేస్తున్న హుమేరా తస్లీమ్‌ను శాతవాహన ఎస్టేట్ ఆఫీసర్‌గా, డాక్టర్ మహమ్మద్ జాఫర్‌ను డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్‌కు డైరెక్టర్‌గా, డాక్టర్ అబ్రారుల్ బకీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్‌గా, డాక్టర్ మనోహర్‌ను చీఫ్ వార్డెన్‌గా, మేనేజ్మెంట్ విభాగానికి బీవోఎస్‌గా డాక్టర్ సరసిజను అకాడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్‌గా, చైర్మన్ బీవోఎస్ కెమిస్ట్రీగా, డాక్టర్ శ్రీరంగ ప్రసాద్‌ను బిజినెస్ మేనేజ్మెంట్ శాఖ అధిపతిగా, డాక్టర్ శ్రీవాణిని ఎకనామిక్స్ శాఖ అధిపతిగా, విజయ ప్రకాశ్‌ను ప్రజా సంబంధాల అధికారిగా, ఇన్‌చార్జి ఆంగ్ల శాఖాధిపతిగా, డాక్టర్ జోసెఫ్ రాజును ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్‌చార్జి శాఖ అధిపతిగా, డాక్టర్ ప్రసాద్‌ను మ్యాథమెటిక్స్ ఇన్‌చార్జి శాఖ అధిపతిగా, డాక్టర్ ఎస్.కిరణ్‌ను వృక్షశాస్త ఇన్‌చార్జి శాఖ అధిపతిగా, డాక్టర్ అర్జున్‌ను ఇన్‌చార్జి కంప్యూటర్ సైన్స్ శాఖ అధిపతిగా నియామకం చేశారు. డాక్టర్ తిరుపతిని కోఆర్డినేటర్ కాన్ఫిడెన్షియల్ సెక్షన్ విభాగంలో, డాక్టర్ మనోజ్‌కుమార్‌ని యూత్ వెల్ఫేర్ ఆఫీసర్‌గా నియామక పత్రాలు అందజేసి అందరూ తమ బాధ్యతతో పనులు నిర్వర్తించాలని సూచించారు. అధ్యాపకేతర సిబ్బంది సంతోష్‌కుమార్‌ను వీసీ వ్యక్తిగత కార్యదర్శిగా, మారుతిని వీసీ వ్యక్తిగత సహాయకులుగా, శ్రీకాంత్‌ను రిజిస్ట్రార్ వ్యక్తిగత సహాయకులుగా నియామకం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment