బైక్ అదుపుతప్పి యువకుడు మృతి
ధర్మారం(ధర్మపురి): ధర్మారం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన నేరువాట్ల సంజయ్ (23) బుధవారం రాత్రి బైక్ అదుపుతప్పి మృతిచెందాడు. ఎస్సై లక్ష్మణ్ తెలిపిన వివరాలు.. సంజయ్ సొంత పనిమీద ధర్మారం వచ్చి తిరిగి రాత్రి 10 గంటలకు ఇంటికి బైక్‌పై వెళ్తుండగా కటికెనపల్లి శివారులో అదుపుతప్పి కిందపడ్డాడు. తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మరణించాడు. మృతుడి తండ్రి నేరువాట్ల రాజయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
గట్టెపల్లి శివారులో ఒకరు..
సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): సుల్తానాబాద్ మండలం గట్టెపల్లి శివారులోని రైల్వే బ్రిడ్జి వద్ద గురువారం ద్విచక్రవాహనం అదుపుతప్పి డోకె అజయ్(20) మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం నంనూర్‌కు చెందిన అజయ్ ద్విచక్ర వాహనంపై మానకొండూర్‌లోని బంధువుల ఇంటికి బయలుదేరాడు. గట్టెపల్లి నుంచి నీరుకుల్ల మీదుగా మానకొండూర్ వెళ్తుండగా ప్రమాదవశాత్తు ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడడంతో తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు కరీంనగర్ ఆస్పత్రి, అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకు తరలించగా అప్పటికే మృతిచెందాడు. ఈ ఘటనపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు అందలేదు.
ద్విచక్రవాహనం ఢీకొని వృద్ధురాలు..
మంథని: మంథని పరిధిలోని బొక్కలవాగు వంతెనపై గురువారం ద్విచక్రవాహనం ఢీకొని మండలంలోని సూరయ్యపల్లి గ్రామానికి చెందిన తాటి కమల(62) మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాలు.. సూరయ్యపల్లికి చెందిన కమల కూరగాయల కోసం నడుచుకుంటూ మంథనికి వచ్చి తిరిగి వెళ్తుండగా బొక్కలవాగు వంతెనపై వెనక నుంచి ద్విచక్రవాహనం ఢీకొట్టింది. తలకు తీవ్రగాయం కావడంతో కరీంనగర్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ముగ్గురు యువకులకు దేహశుద్ధి
కథలాపూర్: కథలాపూర్ శివారులోని ఎస్సారెస్పీ వరదకాలువకు బిగించిన వ్యవసాయ మోటార్‌ను దొంగతనం చేశారనే అనుమానంతో ముగ్గురు యువకులకు స్థానిక రైతులు గురువారం ఉదయం దేహశుద్ధి చేశారు. యువకులు బుధవారం రాత్రి వరదకాలువ వెంబడి తిరుగుతూ వ్యవసాయ మోటార్లను, కాపర్ వైర్లను ఎత్తుకెళ్తున్నట్లుగా స్థానిక రైతులు అనుమానించారు. ఈ విషయంలో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయలేదని గ్రామస్తులు పేర్కొన్నారు.
వ్యక్తిపై కేసు
సారంగాపూర్: మండలంలోని పోతారం శివారు గ్రామం గణేశ్‌పల్లికి చెందిన మహిళపై దాడి చేసిన అదే గ్రామానికి చెందిన ఇడగొట్టు గంగారాంపై గురువారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై దత్తాద్రి తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం బాధిత మహిళ పొలం నుంచి ఇంటికి వస్తున్న క్రమంలో దారిలో గంగారాం వెనుకనుంచి వచ్చి ఆమె చేయి పట్టుకోగా కేకలు వేసింది. ఈమైపె కర్రతో దాడి చేసి గాయపర్చాడు. మహిళ ఫిర్యాదుతో గంగారాంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment