మద్యానికి బానిసై దొంగతనం
ఎలిగేడు(పెద్దపల్లి): మద్యానికి బానిసై చోరీకి పాల్పడిన నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పెద్దపల్లి ఏసీపీ కృష్ణ తెలిపారు. గురువారం సుల్తానాబాద్ పోలీస్‌స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. గత నెల 27న కొత్తిరెడ్డి వేమారెడ్డి, గంధం రవి, గాజంగి లక్ష్మణ్, మడిగే అఖిల్‌సాయి ఎలిగేడు మండలం నారాయణపల్లి గ్రామానికి చెందిన వృద్ధురాలు అట్టేపల్లి లక్ష్మి మెడలో నుంచి పుస్తెలతాడు దొంగిలించారు. పుస్తెలతాడును కుదవబెట్టి రూ.లక్ష డబ్బు తెచ్చుకొని నలుగురు రూ.20,000 చొప్పున పంచుకున్నారు. రూ.20 వేలతో గురువారం వేమారెడ్డి ఇంట్లో దావత్ చేసుకుంటుండగా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. కాగా పుస్తెలతాడు చోరీ సమయంలో సదరు వృద్ధురాలు మంచంపై నుంచి కిందపడడంతో తీవ్రగాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. కేసును ఛేదించడంలో క్రియాశీల పాత్ర పోషించిన ఎస్సై నరేశ్‌కుమార్, ఏఎస్సై తిరుపతి, హెడ్ కానిస్టేబుల్ శాంతయ్య, కానిస్టేబుల్ స్వామికి రివార్డు ప్రకటించినట్లు ఏసీపీ తెలిపారు. కార్యక్రమంలో సీఐ సుబ్బారెడ్డి తదితరులు ఉన్నారు.
నలుగురు నిందితుల అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment