దీక్షాపరులతో కిక్కిరిసిన రైల్వేస్టేషన్
రామగుండం: అయ్యప్ప మాలాధారణ స్వాములతో రామగుండం రైల్వేస్టేషన్ గురువారం కిక్కిరిసింది. మకరజ్యోతి దర్శనం కష్టతరంగా మారడంతో మరుసటి రోజు మణికంఠుడిని ప్రశాంతంగా దర్శించుకునేందుకు శబరిమల వెళ్లే వందలాది మంది దీక్షాపరులు స్టేషన్‌కు రాగా, వారికి వీడ్కోలు పలికేందుకు కుటుంబసభ్యులు తరలిరావడంతో ప్లాట్‌ఫాం వద్ద ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కాగా గురువారం రఫ్తిసాగర్ ఉదయం 10.30 గంటలకు రావాల్సి ఉండగా 15 నిమిషాలు మాత్రమే ఆలస్యంగా రావడంతో భక్తులు ఊపిరిపీల్చుకున్నారు. సాయంత్రం 5 గంటలకు రావాల్సిన కేరళ ఎక్స్‌ప్రెస్ ఎనిమిది గంటల ఆలస్యంతో శుక్రవారం వేకువజామున రానున్నట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment