రాష్ట్రస్థాయి పోటీల్లో విజయం సాధించాలి
కరీంనగర్‌స్పోర్ట్స్: రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడల్లో కరీంనగర్ జోన్ జట్లు విజయకేతనం ఎగురవేయాలని అండర్ ట్రైటీ ఐపీఎస్ వసుంధర యాదవ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల కరీంనగర్ జోన్‌స్థాయి పోలీస్ జట్ల ఎంపిక పోటీలను మహిళలు, పురుషుల విభాగాల్లో నిర్వహించారు. పోటీలకు 400 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఈసందర్భంగా ట్రైనీ ఐపీఎస్ క్రీడాకారులను పరిచయం చేసుకొని పోటీలను ప్రారంభించారు. వివిధ ప్రాంతాల క్రీడాకారుల మధ్య స్నేహ సంబంధాలను పెంపొందించేందుకు క్రీడలు దోహదపడతాయన్నారు. కరీంనగర్‌లో రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం ఏసీపీ విజయకుమార్ ఫుట్‌బాల్ క్రీడాకారులను పరిచయం చేసుకొని మాట్లాడారు. పోలీస్ ఉద్యోగులకు క్రీడలు ఆటవిడుపుగా పనిచేస్తాయన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో కరీంనగర్ జోన్ జట్లు ప్రతిభ చాటి విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు. అనంతరం ఖోఖో, వాలీబాల్, కబడ్డీ, షటిల్ పోటీలు నిర్వహించారు. పోటీల నిర్వహణలో ఆర్‌ఐలు కుమారస్వామి, జానీమియా, సీఐ సంతోష్, ఆర్‌ఎస్‌ఐలు రాజు, మహేశ్, లేక్ పీఎస్ రాజు, డీవైఎస్‌వో వి. శ్రీనివాస్‌గౌడ్, వివిధ సంఘాల ప్రధాన కార్యదర్శులు వై.మహేందర్‌రావు, గిన్నె లక్ష్మణ్, మల్లేశ్‌గౌడ్, క్రీడా సంఘాల ప్రతినిధులు సీహెచ్. సంపత్‌రావు, వి.సూర్యప్రకాశ్, కట్ట సంతోష్, మహమ్మద్ యూనిపాష, డి.వీరన్న, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ట్రైనీ ఐపీఎస్ వసుంధరయాదవ్
కరీంనగర్ జోన్ పోలీస్ జట్ల ఎంపిక పోటీలకు స్పందన
ఐదు జిల్లాల నుంచి 400 మంది క్రీడాకారుల హాజరు
Comments
Please login to add a commentAdd a comment