రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ
వేములవాడఅర్బన్: రాజన్న ఆలయంలో శుక్రవారం భక్తుల రద్దీ నెలకొంది. భక్తులు ధర్మగుండంలో స్నానాలు చేసిన అనంతరం కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకున్నారు. కోడెమొక్కు చెల్లించి, ప్రత్యేక పూజలు చేశారు.
నేటి నుంచి త్యాగరాజ ఆరాధనోత్సవాలు
రాజన్న ఆలయంలో శనివారం నుంచి త్యాగరాజస్వామి ఆరాధన మహోత్సవాలు నిర్వహించనున్నట్లు ఈవో వినోద్‌రెడ్డి తెలిపారు. అభిషేకం టికెట్లు ఈనెల 18 నుంచి 22 వరకు ఉదయం 8.30 గంటల తర్వాత ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఆదివారం, సోమవారం రెండు రోజుల్లో అభిషేకాలు రద్దు చేయనున్నట్లు తెలిపారు.
శివదీక్షలు ప్రారంభం
రాజన్న క్షేత్రంలో శుక్రవారం శివదీక్షలు ప్రారంభమయ్యాయి. అభిషేక మండపంలో ఆలయ ప్రధాన అర్చకులు, గురుస్వాముల ఆధ్వర్యంలో భక్తులు శివమాలలు ధరించారు. శివదీక్ష చేపట్టిన స్వాములు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మాల విరమణ చేయనున్నారు. ఆలయ అర్చకులు నందగిరి భానుశర్మ, శంకరయ్యశర్మ, గురుస్వామి వాసాలమర్రి గోపి తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment