కోనరావుపేట(వేములవాడ): మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంపై దాడిచేసిన వారి కి జైలుశిక్ష విధించినట్లు ఎస్సై ప్రశాంత్‌రెడ్డి తెలి పారు. 2017, మార్చి 19న కోనరావుపేట తహశీల్దార్ కార్యాలయంపై నిమ్మపల్లికి చెందిన జవ్వాజి విమల, డీలర్ చంద్రకళ, మ్యాదరి దేవ య్య, బండ రాజయ్య, బండ సత్తయ్య, పూజం రాజయ్య, గంగాధర్, పూజం లింగయ్య, రెడ్డిమల్ల లచ్చయ్య, మ్యాదరి మధు, జవ్వాజి గంగా ధర్ దాడి చేశారు. ఈ ఘటనపై అప్పటి తహసీల్దార్ నాగరాజమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. పూర్వాపరాలు పరిశీలించిన అనంత రం జవ్వాజి విమలతోపాటు మరో 10 మంది నిందితులకు ఏడాది జైలు, రూ.3వేలు జరిమానా విధిస్తూ ప్రిన్సిపల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ ప్రవీణ్ తీర్పు చెప్పారు. నిందితులు జిల్లా కోర్టులో అప్పీల్ చేయగా జిల్లా న్యాయమూర్తి వారి అప్పీల్‌ను తిరస్కరిస్తూ ఏడాది జైలుశిక్ష విధించినట్లు ఎస్సై పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment