‘కిలిమంజారో’ అధిరోహణ
కరీంనగర్ స్పోర్ట్స్: కరీంనగర్‌కు చెందిన పర్వతారోహకుడు, ఎకై ్సజ్ కానిస్టేబుల్ లెంకల మహిపాల్ రెడ్డి అరుదైన ఘనత సాధించారు. గతంలో కిలిమంజూరో పర్వతాన్ని అధిరోహించిన ఆయన శుక్రవారం మరోసారి అదే పర్వతాన్ని అధిరోహించి, రికార్డు సష్టించారు. ఈ నెల 16న కిలిమంజారో పర్వతారోహణను ప్రారంభించిన మహిపాల్‌రెడ్డి శుక్రవారం పూర్తి చేశారు. పర్వతంపై సే నో టు డ్రగ్స్ అనే బ్యానర్ ఆవిష్కరించారు. రెండోసారి మౌంట్ కిలిమంజారో అధిరోహణకు సహకరించిన ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు అభినందించారు.
గుకేశ్, హంపిలను కలిసిన ‘చెస్’ జిల్లా కార్యదర్శి
కరీంనగర్ స్పోర్ట్స్: చెస్ ప్రపంచ చాంపియన్ షిప్‌ను కై వసం చేసుకున్న దొమ్మరాజు గుకేశ్, భారత చెస్ క్రీడాకారిణి కోనేరు హంపిలను కరీంనగర్ జీనియస్ చెస్ అకాడమీ డైరెక్టర్, కోచ్, ఇంటిగ్రేటెడ్ చెస్ జిల్లా కార్యదర్శి కంకటి అనూప్‌కుమార్ శుక్రవారం ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. వారిని సత్కరించి, వేంకటేశ్వరస్వామి జ్ఞాపికలు అందించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చెస్‌కు విశేష ఆదరణ లభిస్తోందని తెలిపారు. భవిష్యత్తులో చెస్ మెగా టోర్నీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
అనంతపల్లిలో చేపలు మృతి
బోయినపల్లి(చొప్పదండి): అనంతపల్లిలో మ త్స్యకారులు పెంచుకుంటున్న చేపలు శుక్రవా రం మృతిచెందాయి. చేపల మృతిపై మత్స్యకారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని బందంకుంటలో గ్రామానికి చెందిన మత్స్యకారులు చేపలు పెంచుతున్నారు. బందంకుంట వద్దకు శుక్రవారం ఉదయం వెళ్లి చూడగా చేపలు చనిపోయి కనిపించాయి. వీటి విలువ దాదాపు రూ.లక్ష వరకు ఉంటుందని వారు తెలిపారు. బందంకుంటను జిల్లా మత్స్యశాఖ అధికారి సౌజన్య పరిశీలించారు. కుంటలోని మట్టి, నీరును టెస్టింగ్ కోసం హైదరాబాద్ పంపినట్లు తెలిపారు.
మహిళ ఆత్మహత్య
చొప్పదండి: భూపాలపట్నంకు చెందిన నాంపల్లి సూరవ్వ అనే మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై అనూష తెలిపారు. ఆమె కథనం ప్రకారం.. సూరవ్వ కొంతకాలంగా అనారోగ్య ంతో బాధ పడుతోంది. గురువారం ఇంట్లో ఎవరూలేని సమయంలో క్రిమిసంహారక మందు తాగింది. కుటుంబసభ్యులు కరీంనగర్ ఆ స్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందు తూ మృతి చెందింది. మృతురాలి కుమారుడు మహేశ్ శుక్రవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment