![2012](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/05knt215-180094_mr-1738870751-0.jpg.webp?itok=oa7G0Efm)
2012 నుంచి వరుసగా
కరీంనగర్ బధిరుల పాఠశాల విద్యార్థులు 2012 నుంచి జాతీయ ఒలింపియాడ్ స్పోర్ట్స్‌లో పాల్గొని పతకాలు సాధిస్తున్నారు. 2023లో ఒవరాల్ చాంపియన్‌షిప్ కై వసం చేసుకున్నారు. పోటీలకు రెండు నెలల ముందు ట్రైనింగ్ ఇచ్చాం. మంచి ప్రతిభతో పతకాలు సాధించారు.
– టి.మోహన్‌రావు,ఉపాధ్యాయుడు
బంగారు లక్ష్మీప్రసన్న
8వ తరగతి చదువుతున్న లక్ష్మీప్రసన్న 12–14 ఏళ్ల విభాగంలో లెమన్ స్పూన్ క్రీడలో బంగారు పతకం సాధించింది. గతేడాది జరిగిన పోటీల్లో ఇదే అంశంలో సిల్వర్ మెడల్ కై వసం చేసుకుంది. వచ్చే సంవత్సరం రెండు క్రీడల్లో పాల్గొని గోల్డ్ మెడల్స్ సాధిస్తానని పేర్కొంది.
రెండు రజతాల సారిక
6వ తరగతి చదువుతున్న సారిక 9–11 ఏళ్ల విభాగంలో రెండు క్రీడల్లో పాల్గొని రజత పతకాలు సాధించింది. ఫస్ట్ టైం పోటీల్లో పాల్గొనగా ప్రత్యర్థులతో హో రాహోగా పోరాడి తృటిలో బంగారు పతకాలు చే జార్చుకుంది. 50 మీ.రన్నింగ్ రేస్, లెమన్ స్పూన్‌లో రజత పతకాలుకై వ సం చేసుకుంది. భవిష్యత్‌లో బంగారు పతకాలు సాధిస్తానని చెప్పింది.
![2012 నుంచి వరుసగా
1](https://www.sakshi.com/gallery_images/2025/02/7/05knt209-180094_mr-1738870751-1.jpg)
2012 నుంచి వరుసగా
![2012 నుంచి వరుసగా
2](https://www.sakshi.com/gallery_images/2025/02/7/05knt211-180094_mr-1738870751-2.jpg)
2012 నుంచి వరుసగా
Comments
Please login to add a commentAdd a comment