దొడ్డబళ్లాపురం: భర్త చేతిలో వివాహిత హత్యకు గురైన సంఘటన దొడ్డ తాలూకా కోళూరు గ్రామంలో చోటుచేసుకుంది. కోళూరు గ్రామంలో అద్దె ఇంట్లో నివసిస్తున్న ఆరతి (27) హత్యకు గురైన మహిళ. మృతురాలు తన భర్తను వదిలి కుమార్తెను(5) తీసుకుని హరీష్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. అయితే ఆమె చిరునామా తెలుసుకున్న భర్త, హరీష్ ఇంట్లో లేని సమయంలో వచ్చి హత్య చేసి కుమార్తెను తీసికెళ్లాడు.
ఆమెను అత్యంత దారుణంగా కత్తితో పొడిచి హత్య చేయడంతో ఇల్లంతా రక్తంతో నిండిపోయింది. రక్తపు మడుగులో ఉన్న ఆరతిని చూసి ప్రియుడు హరీష్ గ్రామం వదిలి పరారయ్యాడు. దొడ్డ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment