ఛాయాచిత్రాలను వీక్షిస్తున్న అమ్మాయిలు
బనశంకరి: నగరంలో చిత్రకళా పరిషత్‌లో వన్యజీవుల ఛాయాచిత్రప్రదర్శన కళాప్రియులను అలరిస్తోంది. అటవీశాఖ రిటైర్డు అధికారి ఎంఎన్.జయకుమార్ ఎన్‌కౌంటర్స్ ఇన్‌ది వైల్డ్ 2.0 పేరుతో అడవులు, వన్యమృగాల ఛాయాచిత్రాల ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఆయన కెమెరాలో బంధించిన 231 ఫోటోలు వన్యజీవ వైవిధ్యానికి ప్రతీకలుగా నిలిచాయి. ఆఫ్రికా, అమెరికా దేశాల్లో మాత్రమే కనిపించే వన్యమృగాల ఛాయాచిత్రాలు కూడా కొలువయ్యాయి. ఈ ప్రదర్శన అక్టోబరు 8వ తేదీ వరకు జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment