ఆందోళనకారులతో చర్చిస్తున్న తహసీల్దార్
హోసూరు వార్తలు..
హోసూరు: ప్రభుత్వ స్థలంలో రేషన్ దుకాణం ఏర్పాటుకు భూమిపూజ చేస్తుండగా ఈ స్థలం తన సొంతమని ఓ వ్యక్తి అడ్డుకొన్నారు. వివరాల మేరకు హోసూరు తాలూకా అచ్చెట్టిపల్లి పంచాయతీ యడపల్లి గ్రామంలో 160 రేషన్ కార్డులు ఉన్నాయని, రేషన్ దుకాణం ఏర్పాటు చేయాలని చాలా ఏళ్లుగా ప్రజలు కోరుతున్నారు. దీంతో జిల్లా అధికారులు దుకాణం నిర్మాణానికి రూ. 7 లక్షల నిధులను కేటాయించారు. గ్రామంలోని పోరంబోకు స్థలంలో సోమవారం భూమిపూజకు అధికారులు ఏర్పాట్లు చేయసాగారు. ఇంతలో గణేష్ అనే వ్యక్తి అడ్డుకొని ఈ స్థలం తనకే సొంతమని, రేషన్ దుకాణం నిర్మించరాదని అడ్డుకున్నాడు. తమకు ఎలాగైనా దుకాణం నిర్మించాలని గ్రామస్తులు హోసూరు సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేయగా, తహసీల్దార్ సుబ్రమణ్యం వారితో చర్చించారు. రేషన్ దుకాణానికి స్థలాన్ని కేటాయిస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment