బోల్తా పడిన బస్సు, ఘటనా స్థలం వద్ద గుమికూడిన జనం
సాక్షి,బళ్లారి: చిత్రదుర్గం జిల్లాలో ఘోరం చోటుచేసుకుంది. శనివారం సాయంత్రం ఓ పెళ్లి బస్సు అదుపుతప్పి కరెంట్ స్తంభాన్ని ఢీకొనడంతో ఇద్దరు మృత్యువాత పడగా 20 మందికిపైగా గాయపడ్డారు. వివరాలు... హొసదుర్గ తాలూకా సిగేహట్టి గ్రామంలోని వధువు ఇంటి నుంచి దాదాపు 60 మందికి పైగా బంధువులు ప్రైవేట్ బస్సులో దావణగెరెకు బయలుదేరారు. చిత్రదుర్గం జిల్లా హోలాల్కేరే తాలూకా ఉగిణికట్టే–అవినకట్టి గ్రామ సమీపంలో వస్తుండగా డ్రైవర్ అదుపుతప్పి బస్సు కరెంట్ స్తంభాన్ని ఢీకొంది. దీంతో ఇద్దరు మృతి చెందగా, 20 మందికిపైగా గాయపడ్డారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న హొలాల్కేరే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను హొసదుర్గ, చిత్రదుర్గ ప్రభుత్వాస్పత్రుల తరలించారు. తీవ్రంగా గాయపడిన పలువురు చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడుతున్నారు. అప్పటి వరకు కబుర్లు చెప్పుకుని సంతోషంగా ప్రయాణిస్తున్న తమవారు ఇక లేరని తెలుసుకుని బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు.
విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న బస్సు
ఇద్దరు దుర్మరణం
20 మందికి పైగా తీవ్ర గాయాలు
చిత్రదుర్గం జిల్లాలో ఘోరం
Comments
Please login to add a commentAdd a comment