నినాదాలు చేస్తున్న మహిళ
● వీడియో తీసి, నినాదాలు చేస్తూ
మహిళ గలాటా
శివమొగ్గ: అయోధ్య శ్రీరాములవారి ప్రాణ ప్రతిపష్టాపన వేడుకల సందర్భంగా సోమవారం శివమొగ్గ నగరంలో చిన్న గలాటా చోటుచేసుకుంది. నగరంలోని శివప్ప నాయక సర్కిల్‌లో బీజెపి కార్యకర్తలు ప్రజలకు స్వీట్లు, పానకం పంపిణీ చేస్తుండగా ఓ మహిళ ఫోన్లో వీడియో తీస్తూ నినాదాలు చేసింది. స్కూటర్‌లో బాలునితో కలిసి బుర్కాలో వచ్చిన మహిళ జై శ్రీరామ్ అని నినాదాలు చేస్తున్నవారిని వీడియోలు తీయసాగింది. వీడియో తీయవద్దని వారు ఆమెకు చెప్పారు. పోలీసులు జోక్యం చేసుకుని ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని మహిళకు సూచించారు.
ఆమె మానసిక అస్వస్థురాలు: ఎస్పీ
ఆ మహిళ వెళ్లకుండా అల్లాహో అక్బర్ అంటు నినాదాలు చేయడం మొదలు పెట్టింది. దీంత మహిళా పోలీసులు ఆమెను జీపులోకి ఎక్కించడానికి ప్రయత్నించగా ఆమె ఒప్పుకోకపోవడంతో తోపులాట జరిగింది. బీజేపీ కార్యకర్తలు పోలీసుల పైన మండిపడ్డారు. చివరకు పోలీసులు ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఆమె మానసిక అస్వస్థురాలని, కొన్ని రోజులు చికిత్స కూడా పొందినట్లు పోలీసులు చెప్పారు. మహిళను ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించినట్లు జిల్లా ఎస్పీ మిథున్ కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment