నవవధువుపై అత్యాచారయత్నం | - | Sakshi
Sakshi News home page

నవవధువుపై అత్యాచారయత్నం

Published Sun, Jun 23 2024 1:02 AM | Last Updated on Sun, Jun 23 2024 8:41 AM

-

ఎదురు తిరిగినందుకు చాకుతో హత్యాయత్నం

ఇరుగు పొరుగు రక్షించి ఆస్పత్రిలో చేర్పించిన వైనం

నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగింత

సాక్షి,బళ్లారి: ఇటీవల వివాహమైన నవవధువుపై ఓ దుర్మార్గుడు అత్యాచారయత్నానికి పాల్పడగా సదరు మహిళ తిరగబడటంతో చాకుతో హత్యాయత్నానికి పాల్పడిన ఘటన దావణగెరె జిల్లాలో చోటు చేసుకుంది. దావణగెరె జిల్లా జగళూరు తాలూకా చిక్కమ్మనహట్టి గ్రామంలోని గొల్లలదొడ్డికి చెందిన ఓ మహిళకు ఇటీవల వివాహమైంది. 

ఆమె రెండు రోజుల క్రితం పుట్టింటికి రావడంతో పక్కంటి కాటెప్ప(30) అనే వ్యక్తి ఇంట్లో ఎవరూ లేరని గమనించి మహిళపై అత్యాచారానికి యత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో చాకుతో పొడవడంతో గట్టిగా అరిచింది. దీంతో ఇరుగుపొరుగు వారు వెంటనే అక్కడికి చేరుకోవడంతో అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తి పారిపోవడానికి యత్నించాడు. వెంటనే గ్రామస్తులు కూడా పరుగు తీసి సదరు వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు గాయపడిన మహిళను స్థానిక ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement