అహింసా మార్గంలోనే దేశానికి స్వాతంత్య్రం
హొసపేటె: అహింస అనే ఆయుధంతో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన మహనీయుడు మహాత్మాగాంధీజీ అని పీఎల్‌సీ పాఠశాల హెడ్‌మాస్టర్ శ్రీనివాసరెడ్డి కొనియాడారు. టీబీ డ్యాం పీఎల్‌సీ ప్రభుత్వ పాఠశాలలో 155వ మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయులు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ సమరయోధుల పోరాటాల ఫలమే స్వాతంత్య్రం అని అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ 1969 అక్టోబర్ 2న గుజరాత్‌లోని పోరుబందర్‌లో జన్మించారన్నారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలను స్వాతంత్య్ర సమరం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం, అనేక మంది ప్రాణ త్యాగాలు చేయడం వల్ల లక్షల మంది బ్రిటిష్ వారి తుపాకీ గుళ్లకు బలి కావడం గాంధీజీని కలిచి వేసింది. అనంతరం శాంతియుతంగా స్వాతంత్య్ర ఉద్యమాన్ని నడిపి 1947 ఆగస్టు 15వ తేదీన భరతమాతకు బ్రిటిష్ వారి బానిసత్వం నుంచి విముక్తిని కలుగజేశారన్నారు. ఉపాధ్యాయులు రవి, మంజుల, శారద, నిర్మల హేమలత, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment