రేపు పీడీఓల నిరవధిక ధర్నా
హొసపేటె: వివిధ డిమాండ్లను నెరవేర్చాలని ఒత్తిడి చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 4న బెంగళూరు ఫ్రీడం పార్క్‌లో నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పీడీఓల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎల్.చంద్రనాయక్ తెలిపారు. ఉద్యోగులు తమ సేవలను నిలిపి వేసి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. గత ఐదేళ్లలో పదోన్నతి పొందని క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్, క్యాషియర్, వాటర్‌మెన్, జవాన్లు, క్లీనర్లకు గ్రేడ్–2 సెక్రటరీకి సమాంతరంగా పేస్కేల్‌ను నిర్ణయించాలన్నారు. గ్రామ పంచాయతీ సభ్యుల సంఘం, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ రిజిస్టర్డ్ అధికారుల సంఘం వివిధ డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చినట్లు తెలిపారు. అనంతరం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఉమేష్ జహగీరాదార్ మాట్లాడుతూ ఏడాది కాలంలో దాదాపు 21 మంది పీడీఓలు పని ఒత్తిడితో మృతి చెందారన్నారు. దాదాపు ఏడాది నుంచి సెక్రటరీ గ్రేడ్ గ్రూపు నుంచి పీడీఓ గ్రూపుగా పదోన్నతి లేదని, వివిధ గ్రూపులకు చెందిన వెయ్యి మందికి పైగా ఉద్యోగులకు పదోన్నతి లేకుండా పోయిందని, గడువులోగా పదోన్నతులకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment