పిల్లలు వృద్ధులను గౌరవించాలి | - | Sakshi
Sakshi News home page

పిల్లలు వృద్ధులను గౌరవించాలి

Published Thu, Oct 3 2024 1:26 AM | Last Updated on Thu, Oct 3 2024 1:26 AM

పిల్లలు వృద్ధులను గౌరవించాలి

పిల్లలు వృద్ధులను గౌరవించాలి

హొసపేటె: తల్లిదండ్రులు తమ పిల్లలకు సంస్కారం నేర్పితే వృద్ధాశ్రమాల అవసరం ఉండదని జిల్లాధికారి ఎంఎస్‌ దివాకర్‌ తెలిపారు. ఆయన మంగళవారం నగరంలోని చర్చి భవన్‌లో ప్రపంచ వృద్ధుల దినోత్సవాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఇళ్లల్లో పెద్దలను అగౌరవపరచడం ఈ రోజుల్లో కనిపిస్తోందన్నారు. సీనియర్లు తమదైన రీతిలో ఆలోచిస్తారు. వారిని గౌరవించాలనే సందేశాన్ని అందించడమే ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశం అన్నారు. సీనియర్‌ సిటిజన్లను గౌరవించని కుటుంబాలు ఉన్న సమాజంలో అలాంటి కుటుంబాలు సంతోషంగా, ప్రశాంతంగా ఉండలేవన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆస్తిపాస్తులు కల్పించడం మానేసి, పిల్లలను తామే ఆస్తిగా చేస్తే, వారు తల్లిదండ్రులను పిల్లల్లానే చూస్తారన్నారు. సీనియర్‌ సిటిజన్లు జీవితంలో అన్ని తెలిసిన అమాయకుల్లాంటి వారన్నారు. పిల్లలను అంతే అమాయకత్వంతో చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలపై ఉందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై మితిమీరిన ప్రేమ, వ్యామోహం కలిగి ఉండకూడదన్నారు. అది పిల్లలకు అతి చనువుగా మారుతుందని ఆయన హెచ్చరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement