కలుషిత నీరు తాగి 80 మందికి అస్వస్థత
రాయచూరు రూరల్: గ్రామంలో కలుషిత నీరు తాగి 80 మంది ఆస్పత్రి పాలైన ఘటన కలబుర్గి జిల్లా ఆళంద తాలూకా నింబర్గలో చోటు చేసుకుంది. బుధవారం తాలూకాలోని నింబర్గలో బోవి కాలనీలో ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి తాగునీటిని సరఫరా చేస్తున్న సమయంలో మురుగు నీరు అందులో కలవడంతో ఆ నీటిని తాగిన వారు అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు. ఈ ఘటనకు గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారిణి సుకన్యను బాధ్యురాలిగా చేసి సస్పెండ్ చేస్తూ జెడ్పీ సీఈఓ ఆదేశాలు జారీ చేశారు. శాసన సభ్యుడు బీ.ఆర్.పాటిల్ నింబర్గ గ్రామాన్ని సందర్శించి అధికారులతో, గ్రామ పంచాయతీ పాలక మండలితో చర్చించి పరిస్థితిని సమీక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment