కస్టమర్‌పై దుకాణదారుల దాడి
మైసూరు: పెళ్లయిన తరువాత మరింత కట్నం తేవాలని వేధించి కడతేర్చే భర్తలు కొందరైతే, మూడుముళ్లు కట్టకముందే హత్య చేసేవారు మరికొందరు. రెండో కోవకు చెందినవాడే ఈ కిరాతకుడు. జిల్లాలోని హెచ్.డి.కోటె తాలూకాలోని హిరేహళ్ళిలో ఈ దారుణం జరిగింది. వివరాలు.. పొరుగు గ్రామానికి చెందిన నిరంజన్ అనే యువకునితో పుట్టమల్లప్ప, శివనంజమ్మల కుమార్తె కవిత (20)కు ఈ నెల 21వ తేదీన పెళ్ళి జరగాల్సి ఉంది.
కవిత తల్లిదండ్రులు పొలానికి వెళ్లగా, ఆమెను కలవడానికి నిరంజన్ వచ్చాడు. తలుపులు వేసుకుని ఇద్దరూ కొంతసేపు మాట్లాడుకున్నారు. నిరంజన్ బయటకు వచ్చి కవిత ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని ఇరుగుపొరుగుకి చెప్పి వచ్చిన కారులోనే ఉడాయించాడు. దీంతో వారు ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేయగా, వారు వచ్చి కూతురు శవాన్ని చూసి బోరున విలపించారు. తమ కూతురిది ఆత్మహత్య కాదని, కాబోయే అల్లుడే హత్య చేశాడని రోదించారు. వారు అంతరసంత పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిరంజన్ కోసం గాలిస్తుండగా అతడు వచ్చి లొంగిపోయాడు. అరెస్టు చేసి విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment