నకిలీ నోట్ల చెలామణి కలకలం
● సిరవారలో ఆందోళనలో ప్రజలు
రాయచూరు రూరల్: జిల్లాలో వివిధ రకాలైన సైబర్ నేరాలు జరుగుతుండగా మరో వైపు అంతరాష్ట్ర దొంగల ముఠాల బీభత్సం చోటు చేసుకుంది. రాయచూరు జిల్లాలో ఏడాది క్రితం రూ.200 నకిలీ నోట్లు చెలామణి జరిగిన విషయం విదితమే. అందులో భాగంగా బుధవారం సిరవార ప్రాంతంలో రూ.500 నకిలీ కరెన్సీ నోట్లు చెలామణి అవుతున్నట్లు సమాచారం అందింది. సిరవార, హిరేహణిగి, హట్టి, లింగసూగూరు, కోఠా, ముదుగల్, ఇతర ప్రాంతాల్లో దుకాణాలు, మద్యం అంగళ్లలో చెలామణి అవుతున్నట్లు పోలీసులు వీటి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు అభ్యర్థిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment