బ్రేకులు పడని బాల్య వివాహాలు
బనశంకరి: ఆడపిల్లకు త్వరగా పెళ్లి చేసెయ్యాలి, ఒకింటికి పంపించేసేయాలి అనుకుని 18 ఏళ్లు నిండకముందే మూడుముళ్ల తంతు పూర్తి చేసేయడం అన్నిచోట్లా జరుగుతోంది. చిన్న వయసులోనే పెళ్లి వల్ల అన్నీ అనర్థాలే అని ఎంత చెప్పినా పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో ఎంతగా జాగృతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నా బాల్య వివాహాలకు అడ్డుకట్ట పడటం లేదు. ఏటేటా పెరుగుతూ పోతున్నాయి.
అగ్రస్థానం.. చిత్రదుర్గం, మండ్య
బాల్య వివాహాల నిషేధ చట్టం కింద 2023–24లో నమోదైన బాల్య వివాహాల కేసుల్లో చిత్రదుర్గ జిల్లా అగ్రస్థానంలో ఉంది. గత మూడేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,465 బాల్య వివాహాల కేసులు నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇందులో 2021– 22లో 418 కేసులు నమోదు కాగా, 2022–23లో 328 కేసులు వచ్చాయి. 2022– 24లో మొత్తం 719 గా ఉన్నాయి. ప్రభుత్వ వివరాల ప్రకారం 204 బాల్య వివాహాలతో మండ్య మొదటి స్థానంలో నిలిచింది. తరువాత శివమొగ్గ 148 పెళ్లిళ్లతో శివమొగ్గది రెండో స్థానం. 139 కేసులతో మైసూరు మూడో స్థానం, 86తో బాగల్‌కోటే, 79 పెళ్లిళ్లతో విజయపుర ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. కోలారు జిల్లాలో కూడా ఎక్కువసంఖ్యలో బాల్య వివాహాలు కేసులు రావడం గమనార్హం. ఇక లెక్కలోకి రాకుండా జరుగుతున్న వివాహాల సంఖ్య ఏటా 3 వేలకు పైగానే ఉండవచ్చని ఒక అంచనా.
అడ్డుకట్టకు ఆపసోపాలు
సామాజిక దురాచారంగా మారిన బాలల పెళ్లిళ్లకు ఎలా అడ్డుకట్ట వేయాలా? అని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. తాలూకా, జిల్లా స్థాయి అధికారులకు కట్టుదిట్టమైన చర్యలకు సూచించింది. అంగన్‌వాడీ సిబ్బంది తమ పరిధిలో ఇలాంటివి జరిగితే తక్షణమే ఉన్నతాధికారులకు సమాచారమివ్వాలని తెలిపింది.
మూడేళ్లలో 1,465 కేసుల నమోదు
బాలికకు పెళ్లి..
తల్లిదండ్రులకు ఏడాది జైలు
యశవంతపుర: బాలికకు వివాహం చేసిన యువకుడి తల్లిదండ్రులు, బాలిక తల్లిదండ్రులకు ఇక్కడి మంగళూరు కోర్టు ఏడాది జైలుశిక్ష విధిస్తూ తీర్పుచెప్పింది. వివరాలు...ఉళ్లాల తాలూకా మంజనాడి గ్రామానికి చెందిన మహ్మద్ ఉమ్తియాజ్‌కు అతని తల్లిదండ్రులు 2023 మే 31న బాలికతో వివాహానికి యత్నించారు. విషయం మహిళా శిశు సంక్షేమ శాఖ దృష్టి రావడంతో వారు అడ్డుకున్నారు. ఇరువైపుల వారిపై కేసు నమోదు చేశారు. అయితే అప్పటికే మైనర్ బాలికకు పెళ్లి చేసిన విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు విచారణ చేసిన మంగళూరు న్యాయస్థానం ఉమ్తియాజ్ తల్లిదండ్రులు మోహమ్మద్, మైమునా, బాలిక తల్లిదండ్రులు అబ్బుల్, కమైత్‌లకు ఏడాదిపాటు కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment