ఐసీయూలో వృక్ష మాత తిమ్మక్క
బనశంకరి: అనారోగ్యంతో బాధపడుతున్న వృక్ష మాత సాలుమరద తిమ్మక్క బెంగళూరులో జయనగరలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఐసీయూలో ఆమెకు వైద్య సేవలు అందిస్తున్నారు. గత 17 రోజులుగా శ్వాసకోశ సమస్యతో తిమ్మక్క బాధపడుతున్నారు. వయోభారం కూడా వేధిస్తోంది.
1911లో జననం
మొక్కలను పెంచడంలోనే సంతోషాన్ని వెతుక్కునే తిమ్మక్క 1911, జూన్ 30న తుమకూరు జిల్లాలోని గుబ్బి తాలూకాలో జన్మించారు. బిక్కల చిక్కయ్యతో పెళ్లయిన తరువాత రామనగర జిల్లా మాగడి తాలూకాలోని హుళికల్ గ్రామానికి వచ్చారు. ఆమెకు మొక్కలంటే ప్రాణం, తన ఊరి నుంచి ప్రధాన రహదారి వరకు సుమారు 400 మర్రి మొక్కలను నాటారు. తరువాత అవి పెద్ద వృక్షాలుగా ఎదిగాయి. జీవితకాలంలో 8 వేలకు పైగా మొక్కలను నాటి సంరక్షించారు. ఆమె కృషిని గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం, అనేక జాతీయ సంస్థలు ఇచ్చిన అవార్డులకు లెక్కలేదు. రాష్ట్ర, అంతర్జాతీయ స్థాయి పురస్కారాలే 16 దాకా వచ్చాయి. పచ్చదనానికి ప్రతీకగా నిలిచిన తిమ్మక్క అనేక దేశాల్లో సదస్సులకు హాజరై ప్రసంగించారు.
Comments
Please login to add a commentAdd a comment