ఘరానా సైబర్ ముఠాకు సంకెళ్లు
బనశంకరి: ఆన్‌లైన్ మోసాల ద్వారా లక్షలాది రూపాయలు దోచేస్తున్న 10 మంది ముఠాను మంగళవారం బెంగళూరు ఉత్తర విభాగం సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్‌చేశారు. ఈ కేసులో కింగ్‌పిన్ దుబాయిలో ఉండగా అక్కడ నుంచి వంచకులకు మార్గదర్శనం చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది.
వంచన కేసులో దర్యాప్తు...
నగరంలోని మహాలక్ష్మీలేఔట్ వాసి ఆన్‌లైన్ మార్కెటింగ్ ద్వారా లాభాలు అనే ప్రకటన చూసి మోసగాళ్ల వాట్సాప్ గ్రూప్‌లో చేరాడు. బ్య్రాండి స్పీడ్ అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేయించి పెట్టుబడి పెట్టించారు. అక్టోబరు 4 నుంచి నవంబరు 9 వరకు దశలవారీగా మొత్తం రూ.88.83 లక్షలను అతడు వివిధ అకౌంట్లకు జమచేశాడు. తరువాత పైసా కూడా తిరిగి రాకపోవడంతో ఉత్తర విభాగం సీఈఎన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. విచారణ సాగించిన పోలీసులు.. ఆయా బ్యాంకు ఖాతాల వివరాల ప్రకారం ఆకాశ్, రవిశంకర్, ప్రకాశ్, ప్రజ్వల్, సునీల్, సురేశ్, ఓబుళరెడ్డి, మధుసూదన్, శ్రీనివాస్‌రెడ్డి, కిశోర్‌కుమార్ అనే 10 మందిని యశవంతపురలో అరెస్ట్ చేసి ప్రశ్నించగా ఆన్‌లైన్ నేరాలు చేస్తున్నట్లు ఒప్పుకున్నారు. సులభంగా డబ్బు సంపాదించాలని ఉద్దేశంతో ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. దందా నిర్వహించడానికి త్యాగరాజనగర, సదాశివనగరలో ప్రత్యేక ఆఫీసులే తెరిచారు. వాటి ద్వారా అమాయకులకు కాల్స్, మెసేజ్‌లు చేస్తూ వల వేసేవారు. డబ్బును బినామీ ఖాతాల్లోకి వేయించి వెంటనే విత్‌డ్రా చేసేవారు.
భారీగా ఫోన్లు, సిమ్‌లు, పాస్‌బుక్కులు..
ఈ రెండు ఆఫీసుల్లో సోదాలు చేయగా 51 మొబైల్‌ఫోన్లు, 500ల సిమ్‌కార్డులు, 27 డెబిట్‌కార్డులు, 108 బ్యాంక్ పాస్ పుస్తకాలు, 480 సిమ్‌కార్డులు, 2 ల్యాప్‌టాప్‌లు, 2 సీపీయు, 48 అకౌంట్ క్యూఆర్ కోడ్ స్కానర్లు, 42 రబ్బర్ స్టాంప్‌లు, జీఎస్‌టీ రికార్డులు, 230 కరెంట్ అకౌంట్ రికార్డులు లభించాయి. దుబాయ్‌లో ఉండే సూత్రధారి వారి చేత నేరాలు చేయిస్తున్నట్లు చెప్పారు. ఈ ముఠా విచారణలో అనేక మోసాలు బయటపడే అవకాశముంది.
బెంగళూరులోనే 2 ఆఫీసుల ఏర్పాటు
ఓ బాధితుని ఫిర్యాదుతో
విచారణలో వెలుగులోకి
Comments
Please login to add a commentAdd a comment