రూ.1,600 కోట్ల భూమి అక్రమార్కులపరం
బనశంకరి: వందలాది కోట్ల విలువచేసే ప్రభుత్వ భూమి కొందరు అక్రమార్కుల పరమైందని మంగళవారం బీజేపీ నేత ఎన్‌ఆర్.రమేశ్ నగరంలో లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా 200 పేజీల ఆధారాలను ప్రదర్శించారు. ఆయన మాట్లాడుతూ మాగడి ఎమ్మెల్యే హెచ్‌సీ.బాలకృష్ణ ప్రభావంతో బెంగళూరు నగర జిల్లాలోని అనేకమంది అసిస్టెంట్ ఉప విభాగాధికారి, తహసీల్దార్లు, సర్వేయర్లు, ఇతర సిబ్బంది కలిసి విలువైన ప్రభుత్వ భూమిని భూకబ్జాదారులకు దక్కేలా చేశారు. కెంగేరి హొబళి, కెంగేరి గ్రామ సర్వే నెంబరు 69 లో మొత్తం 183 ఎకరాల విస్తీర్ణం కలిగిన ప్రభుత్వ భూమి ఉంది. 37.20 ఎకరాల భూమిని 1973లో 25 మంది ఎస్సీ,ఎస్టీలకు 1.20 ఎకరాల చొప్పున ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ భూమిని అక్రమంగా కొనుగోలు చేస్తున్నారు. సుమారు రూ.50 కోట్ల మొత్తం లంచం తీసుకుని సుమారు రూ.1,600 కోట్లకు పైగా మార్కెట్ విలువ కలిగిన 37.20 ఎకరాల విస్తీర్ణం భూమిని చట్టానికి వ్యతిరేకంగా విక్రయించడానికి అనుమతి తీసుకున్నారు అని ఆయన ఆరోపించారు. ఈ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు.
లోకాయుక్తకు ఫిర్యాదు
Comments
Please login to add a commentAdd a comment