నటి పవిత్రగౌడ విడుదల
యశవంతపుర: చిత్రదుర్గం రేణుకాస్వామి హత్య కేసులో ప్రధాన నిందితురాలు, నటి పవిత్రాగౌడ మంగళవారం బెంగళూరు పరప్పన అగ్రహార జైలు నుంచి విడుదలయ్యారు. బెయిల్ వచ్చిన నాలుగు రోజుల తరువాత ఆమెకు స్వేచ్ఛ లభించింది. జూన్ 9వ తేదీన ఆమెను బెంగళూరు ఆర్‌ఆర్ నగర పోలీసులు అరెస్టు చేశారు. ఆనాటి నుంచి జైలులోనే ఉంది. రెండవ నిందితుడు, నటుడు దర్శన్ అనారోగ్యంతో 6 వారాల కిందటే విడుదల కావడం తెలిసిందే.
నాలుగు రోజుల నుంచి పవిత్ర బెయిలు పని జరుగుతోంది. పవిత్రాగౌడతో పాటు 14వ నిందితుడు ప్రదోశ్ కూడ విడుదలయ్యాడు. పవిత్రాగౌడను తల్లిదండ్రులు, సోదరుడు జైలు వద్ద నుంచి కారులో ఆర్‌ఆర్ నగరలోని ఇంటికి తీసుకెళ్లారు. పవిత్ర మాజీ భర్త సంజయ్ సింగ్ సంతోషం వ్యక్తం చేశారు. పవిత్రను, కూతురు ఖుషీని త్వరలో కలుస్తానని చెప్పాడు.
Comments
Please login to add a commentAdd a comment